Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాతీ ముద్దుగుమ్మ 'ఫర్జానా'తో ముచ్చట్లు

Webdunia
గురువారం, 5 జూన్ 2008 (10:05 IST)
FileWD
' భాగ్యలక్ష్మీ బంఫర్ డ్రా' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గుజరాతీ ముద్దుగుమ్మ ఫర్జానా ఆపై తెలుగులో ఓ రెండు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఫర్జానా అక్కడ స్టార్ ఇమేజ్ ఉన్న శరత్‌కుమార్ సరసన '1977' అనే చిత్రంలో నటిస్తోంది.

తెలుగు పరిశ్రమతో పాటు తమిళ పరిశ్రమ సైతం తనకు నచ్చిందని చెబుతున్న ఫర్జానాతో కాసేపు మాటామంతి...

1977 చిత్రంలో నటిస్తున్న సమయంలో శరత్‌కుమార్ నుంచి మీరు ఏమి గ్రహించారు?
ఆయన చాలా సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నటించారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా. రాజకీయాలు, సినిమాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఆయన కొన్ని ఉదాహరణలతో నాకు వివరించారు. మనం చేసే పనిమీద శ్రద్ధ పెడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు.

శరత్‌కుమార్‌తో నటిస్తున్న చిత్రంలో నేను జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నాను. జర్నలిజం గురించి షూటింగ్ సమయంలో నాకు తెలిసింది. నిజంగా జర్నలిజం అనేది సాహసమే.

నటనలో అనుభవంలేని మీరు ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు?
నేను పలు యాడ్స్‌లో నటించాను. ఎల్.జి. ఫోన్స్, కొన్ని జ్యూయెలర్స్ యాడ్స్ చేశాను. అందులో భాగంగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాను. అక్కడికి వచ్చిన దర్శకుడు నిధిప్రసాద్ తన సినిమా గురించి చెప్పారు.

మరుసటిరోజు వారి ఆఫీసుకు వెళ్లాను. ఫోటోసెషన్ చేశాక ఆ చిత్రంలో నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా చిత్రంతో నటినయ్యాను.

గ్లామర్‌పై మీ అభిప్రాయం?
నేను తెలుగులో చేసినవన్నీ కామెడీ చిత్రాలే. అందులో అన్నీ హోమ్లీ పాత్రలే. పాటల్లో మాత్రం గ్లామర్‌గా నటించాను. సీమశాస్త్రి చిత్రంలో బాగా గ్లామర్‌గా నటించానని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే సినిమా వ్యాపారం కనుక ఆ మాత్రం చేయక తప్పదు.

ఎటువంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
ఫెరోషియస్ పాత్రలంటే ఇష్టం. విజయశాంతి తరహా యాక్షన్ పాత్రలు చేయాలని ఉంది. నేను డాన్స్‌నే కాక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను.


టెక్నికల్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది?
అవును. భవిష్యత్‌లో సినిమా తీస్తే... (నవ్వుతూ) అన్నీ తెలుసుకోవాలి కదా. టెక్నికల్‌గా అవగాహన కూడా ఉంటే అంతా ఈజీగా ఉంటుంది కదా.

మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారని వార్తలు వచ్చాయి?
నిజమే. అయితే అతను విదేశాల్లో ఉన్నాడు. చాలాకాలం నుంచి మా మధ్య రిలేషన్ ఉంది.

మరి పెళ్లెప్పుడు?
ఇంకా టైం ఉంది. అప్పుడు తప్పకుండా చెబుతాను.

మీ క్వాలిఫికేషన్ వివరాలు?
బికామ్. ఎరోబిక్‌లో సర్టిఫికేట్ కోర్సు, న్యూట్రిషన్, ఉమెన్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్.

మీకు ఇష్టమైన ఆటలు?
టెన్నీస్, సినిమాల్లో రాకపోతే టెన్నీస్ ప్లేయర్ అయ్యేదాన్నేమో. అంత బాగా ఇష్టం. చెస్ నేర్చుకోవాలని అనుకున్నా కానీ కుదరలేదు.

కోపమెస్తే ఏం చేస్తారు?
సైలంట్ ఈజ్ మోస్ట్ ఎనర్జీ... అందుకే చాలా సైలెంట్‌గా ఉంటాను.

మీపై వచ్చే గాసిప్స్‌కు ఎలా స్పంధిస్తారు?
చెప్పాను కదా... చాలాసార్లు తెలుగులోని ఓ హీరోతో సంబంధం ఉన్నట్టు రాశారు. అలాంటప్పుడు కోపం వస్తుంది. కానీ ఆ సమయంలో మౌనంగానే ఉంటాను.

మీకు ఇష్టమైన దుస్తులు?
జీన్స్, టీషర్ట్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments