Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ప్రేమలో పడలేదు : అమీషా పటేల్

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2009 (17:26 IST)
WD
" కహోనా... ప్యార్‌హై" నాక్యా అంటూ హృతిక్‌తో జతకట్టిన అమీషా పటేల్ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో బిజీ బిజీగా ఉంది. గోవిందా, సంజయ్‌దత్‌లతో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో "బద్రి"లో పవన్ సరసన, మహేష్ బాబుతో "నాని"లో నటించిన అమీషా వినాయక చవితినాడు హైదరాబాద్ వచ్చింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న అమీషా... ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో కొన్ని మీ కోసం....

ప్రశ్న... ఫ్యాషన్‌గా కన్పించడంపై మీ అభిప్రాయం?
జ... సినిమా ఫీల్డులో ఫ్యాషన్‌గా కన్పించడం నటీనటులకు చాలా అవసరం. నాకూ ఫ్యాషన్‌గా కన్పించడమంటే ఇష్టం.

ప్రశ్న... ఈ మధ్య తెలుగులో నటించడం తగ్గించారుగా...?
జ... ఎన్టీఆర్ నటించిన "నరసింహుడు"లో చేశాను. ఆ తర్వాత హిందీలో బిజీగా ఉన్నా. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాను.

ప్రశ్న... అందంగా కన్పిస్తున్నారు. మీ ఆరోగ్య రహస్యం?
జ... చిరునవ్వే. నా స్టైల్.. సంతోషంలోనే అందం ఉంటుందని సన్నిహితులంటుంటారు. రోజూ వ్యాయామం చేస్తాను.

ప్రశ్న... హైదరాబాద్ రావడం ఎలా ఉంది?
జ... ఇంతకుముందటి ఎయిర్‌పోర్ట్‌కు, ప్రస్తుత ఎయిర్‌పోర్ట్‌ను కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. శంషాబాద్ రావడం ఇదే మొదటి సారి. చాలా అందంగా విశాలంగా ఉంది. నా ఫేవరేట్ సిటీ ఇది.

ప్రశ్న.... ప్రస్తుతం హిందీలో చేస్తున్న చిత్రాలు?
జ... సంజయ్‌తో "చతుర్ సింగ్ 2 స్టార్", గోవిందాతో "రన్ భోలా రన్" చిత్రాలు.

ప్రశ్న... ఇంతవరకు ఎవరి ప్రేమలోనైనా పడ్డారా?
జ. ప్రేమ అనేది ఒక భావోద్వేగం. నేను ఎక్కువగా అభిమానుల్నే ప్రేమిస్తా. ఇంకా ఎవరి ప్రేమలో పడలేదు.

ప్రశ్న... హాలీవుడ్‌కు వెళుతున్నారని తెలిసింది?
జ... ప్రస్తుతానికి బాలీవుడ్డే... హాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచన లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments