Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి: నితిన్

"రెచ్చిపో" అయినా కలిసొస్తుందా?

Webdunia
WD
నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడిగా "జయం"లో పరిచయం అయిన హీరో నితిన్.. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితంలేకపోయింది. వరుసగా చేసుకుంటూపోతే ఏదోనాడు విజయం దక్కుతుందనే ఆశతో నితిన్ ఉన్నాడు. తాజాగా "రెచ్చిపో" అంటూ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నితిన్‌తో కాసేపు..

ప్రశ్న: విజయాలు రావట్లేదు. "రెచ్చిపో"లో జాగ్రత్తలు తీసుకున్నారా?
జ: ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో కాస్త కామెడీ, ప్రేమ సన్నివేశాలు తక్కువగా ఉండేవి. 'రెచ్చిపో'లో అన్ని సమపాళ్ళలో ఉంటాయి. పైగా నాతో తొలిసినిమా తీసిన నిర్మాతలంతా బాగున్నారు. ఆ సెంటిమెంట్ కలిసివస్తుందేమో చూడాలి.

ప్రశ్న: ఇలియానాతో నటించడం ఎలా అనిపించింది?
జ: నిజం చెప్పాలంటే.. 'దేవదాసు'కు ముందే ఆమెతో నటించాల్సింది. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారిపోయింది. ఇప్పుడు ఆ ఛాన్సు వచ్చింది.

ప్రశ్న: ఎందుకోసం రెచ్చిపోతుంటారు?
జ: ప్రేమకోసమే. ఇందులో నేను దొంగగా నటిస్తున్నాను. రొటీన్‌కు భిన్నంగా అమ్మాయి మనసు దొంగలిస్తాను. అక్కడనుంచి ఓ పోరాటం మొదలవుతుంది. అదే సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది.

ప్రశ్న: బాడీలాంగ్వేజ్ రీత్యా ఏదో ప్రత్యేకత చూపిస్తారు. ఎందుకని?
జ: ఏదైనా కొత్తదనం కావాలి. అందుకే అలా చేస్తున్నాను. 8ప్యాక్ బాడీ వరకు పెంచాను. తర్వాత మామూలుగానే ఉన్నాను. అడవిలో సాదాసీదాగా చేశాను.

ప్రశ్న: "అడవి" చిత్రం తర్వాత హిందీలో ఆఫర్లు వచ్చాయంటున్నారు. నిజమేనా?
జ: అవును. కానీ అడవి-2 కాదు. రంగీలా తరహాలో ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ క్రియేషన్‌లో ఓ చిత్రం చేస్తున్నాను.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments