Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేలో ముగాబే పాలనకు తెర... తెరవెనుక ఏం జరిగిందంటే..

జింబాబ్వేలో మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన రాబర్ట్ ముగాబే పాలనకు తెరపడింది. 93 యేళ్ళ ముగాబే దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన పాలనా శకం ముగిసింది. ఇటీవల సైనిక తిరుగుబాటు కారణంగా రాబర్ట్ ము

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (10:04 IST)
జింబాబ్వేలో మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన రాబర్ట్ ముగాబే పాలనకు తెరపడింది. 93 యేళ్ళ ముగాబే దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన పాలనా శకం ముగిసింది. ఇటీవల సైనిక తిరుగుబాటు కారణంగా రాబర్ట్ ముగాబేను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెల్సిందే. వారం రోజులుగా సైన్యం, ప్రజలు ఎంతగా కోరుతున్నా రాజీనామాకు అంగీకరించని ముగాబే.. తనను తొలగించడానికి జింబాబ్వే పార్లమెంటు అభిశంసన తీర్మానం పెట్టడానికి సిద్ధమైన వేళ మెట్టుదిగారు.
 
"రాబర్ట్‌ గాబ్రియేల్‌ ముగాబే అను నేను జింబాబ్వే రాజ్యాంగంలోని సెక్షన్‌ 96 ప్రకారం తక్షణమే అమలయ్యేలా నా రాజీనామాను లాంఛనంగా సమర్పిస్తున్నాను" అంటూ రాజీనామా లేఖ పంపారు. ఈ నిర్ణయాన్ని తాను స్వచ్ఛందంగా తీసుకున్నానని, అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ముగాబే అభిశంసనకు సంబంధించి చర్చ జరుగుతుండగానే ఆయన రాజీనామా లేఖ అందడంతో.. చర్చను ముగిస్తున్నట్టు స్పీకర్‌ జాకబ్‌ ముడెండా ప్రకటించారు.
 
ఇదిలావుండగా, జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోగా, రాబర్ట్ ముగాబే స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారైంది. అయితే, హఠాత్తుగా జరిగిన సైనిక తిరుగుబాటు వెనుక చైనా హస్తం ఉందనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాస్తవానికి 1970 నుంచి జింబాబ్వేతో చైనా స్నేహ సంబంధాలు బలంగానే ఉన్నాయి. 
 
ముగాబేతో సన్నిహితంగా మెలిగిన చైనా... అక్కడి వ్యవసాయరంగం, షిప్పింగ్ ఇలా దాదాపు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. జింబాబ్వేకు అప్పటి సోవియట్ రష్యా ఆయుధాలను సరఫరా చేయడానికి విముఖత చూపడంతో... చైనా ముందుకు వచ్చింది. జింబాబ్వే కొత్త పార్లమెంటు నిర్మాణానికి ఆసక్తి చూపింది.
 
అలాంటి చైనాకు, జింబాబ్వేకు మధ్య గత కొన్నేళ్లుగా కొన్ని విభేదాలు తలెత్తాయి. చైనాతో ఆయుధాల ఒప్పందాన్ని 2008లో జింబాబ్వే రద్దు చేసుకుంది. ఆయుధాలను తిప్పి పంపించింది. ఇది చైనాకు ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే, అప్పటికే బిలియన్ డాలర్ల పెట్టుబడులను జింబాబ్వే పెట్టి ఉండటంతో... చైనా సైలెంట్ అయిపోయింది. మరోవైపు, సందు దొరికినప్పుడల్లా ముగాబే పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చింది. ముగాబే గద్దె దిగిపోవాలంటూ పలుమార్లు పరోక్షంగా హెచ్చరించింది.
 
మరోవైపు, వయసు మీదపడటంతో, తన భార్య గ్రేస్‌ను అధ్యక్షురాలిగా చేయాలని ముగాబే భావించారు. ఈ నిర్ణయం సొంత పార్టీలోనే చిచ్చు రాజేసింది. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంది. జింబాబ్వే ఆర్మీ చీఫ్ కాన్ స్టాంటినో చివెంగాను చైనాకు ఉన్నపళంగా పిలుపించుకుంది. ఈ నెల మొదట్లో చైనా పర్యటన నుంచి చివెంగా తిరిగి వచ్చిన వెంటనే.... సైనిక తిరుగుబాటు జరిగింది. దీంతో, ఈ మొత్తం వ్యవహారం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, జింబాబ్వేలో ఇంత జరుగుతున్నా చైనా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments