Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దెకు ఇంగ్లండ్‌ ఫామ్‌ హౌస్‌: అద్దె మాత్రం కేవలం వందే.. కానీ 416 గొర్రెలు ఇస్తారట..!

Webdunia
మంగళవారం, 24 మే 2016 (15:41 IST)
పట్టణాల్లో, నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే వేలు వేలు ఖర్చు పెడుతుంటాం. అలాంటిది వందల ఎకరాలతో కూడిన లగ్జరీ ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకోవాలంటే లక్షలు పెట్టాల్సిందే. కానీ ఇంగ్లండ్‌లోని సౌత్ వేల్స్‌ సమీపంలో ఉన్న పార్స్ ఫామ్‌ను ఏడాదికి వంద రూపాయలకే అద్దెకిస్తామని ఓ స్వచ్ఛంధ సంస్థ ప్రకటించింది. అయితే ఆ ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవాలంటే.. కొన్ని షరతులు తప్పనిసరి. ఏడాదికి కేవలం వంద రూపాయలకే అద్దెకిచ్చే ఆ ఫామ్ హౌస్‌లో ఉండాలంటే.. 416 గొర్రెలతో పాటు కొన్ని జీవ జాతుల్ని కూడా కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. 
 
ప్రకృతిని ప్రేమించేవారు.. పెట్స్‌ను ముద్దుగా చూసుకునే వారికే ఈ ఫామ్ హౌస్ అద్దెకు సొంతమవుతుంది. అందుకే నేషనల్ ట్రస్ట్ ప్యానల్ ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవాలనుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తోంది. వ్యవసాయం చేసిన వారు, ప్రకృతిని పరిరక్షించే వారే ఈ హౌస్‌కు అద్దెకు రావొచ్చునని ట్రస్టు పేర్కొంది. నాలుగు బెడ్ రూమ్‌లతో కూడిన ఈ ఫామ్ హౌస్‌ను కొన్ని జీవజాతులను కాపాడేందుకు.. ప్రకృతిని పరిరక్షించేందుకే ఏడాదికి వంద రూపాయల చొప్పున పదేళ్ల వరకు అద్దెకిచ్చేందుకు ఇస్తున్నట్లు ట్రస్టు అధికారులు తెలిపారు. 140 ఎకరాలతో కూడిన ఈ ఫామ్ హౌస్ సముద్రానికి సమీపంలో ఉంటుంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments