Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు లేకుండా నడిచే స్మార్ట్ ట్రైన్... (వీడియో)

ప్రపంచ తొలి స్మార్ట్ ట్రైన్‌ను చైనా ఆవిష్కరించింది. ఈ ట్రైన్‌ ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రైన్ ప్రత్యేకతలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ యేడాది జూన్‌లో ఈ స్మార్ట్ ట్ర

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (11:17 IST)
ప్రపంచ తొలి స్మార్ట్ ట్రైన్‌ను చైనా ఆవిష్కరించింది. ఈ ట్రైన్‌ ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రైన్ ప్రత్యేకతలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ యేడాది జూన్‌లో ఈ స్మార్ట్ ట్రైన్‌ను ఆవిష్కరించగా.. ప్రస్తుతం హునాన్‌ రాష్ట్రంలోని జుజోయ్‌ నగరంలో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు.
 
సాధారణంగా ట్రైన్ అనగానే దానికో పట్టాలు.. ప్రత్యేక వ్యవస్థలు ఉండాలి. ఉంటాయి కూడా. కానీ, ఈ స్మార్ట్ ట్రైన్‌కు అలాంటివేం అక్కర్లేదు. బ్యాటరీ, రోడ్డుపై చిన్నపాటి గీతలుంటే సరిపోతుంది. ఈ ట్రైన్ ఎంచెక్కా దూసుకెళుతుంది. 
 
ఈ తరహా రైల్వే వ్యవస్థను అటానమస్‌ రైల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (ఏఆర్‌టీ)గా వ్యవహరిస్తారు. మూడు బోగీలు ఉండే ఈ రైల్లో ఒకేసారి 300 మంది ప్రయాణించొచ్చు. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 25 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. రోడ్లపై గీసిన తెల్లటి చారలపై ఈ రైలు నడుస్తుంది. 
 
అంతేకాదు అర్బన్‌ ట్రైన్‌ లేదా ట్రామ్‌లు నడవాలంటే ట్రాక్‌లు తప్పనిసరి. దీనికి వాటితో పనిలేదు. అందుకే దీని ఏర్పాటుకు ఖర్చు కూడా తక్కువే అవుతోంది. ప్రస్తుతానికి నాలుగు స్టేషన్లను కలుపుతూ 3.1 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే యేది ఆఖరు నాటికి ఈ రైలు చైనాలో పరుగులు పెట్టనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments