Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్‌ను మింగేసి కొద్దిరోజులు కడుపులోనే ఉంచుకుంది... తర్వాత ఏమైందంటే?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:04 IST)
ఓ మహిళ గొంతులో గుచ్చుకున్న చేప ముల్లును తీసుకునేందుకు ప్రయత్నిస్తుండుగా ఐదు అంగుళాల స్పూన్‌ను మింగేసి ఆసుపత్రిపాలైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. స్పూన్ కడుపులోకి వెళ్లడం వల్ల కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన లిలీ అనే మహిళ‌కు ఎక్స్‌రే తీయగా కడుపులో 13 సెం.మీ (5 అంగుళాలు) పొడవైన స్పూన్ కనిపించింది.


ఆ మహిళ ఏప్రిల్ 5వ తేదీనే స్పూన్‌ను మింగేసినా చాలా రోజులు వరకు ఆసుపత్రిలో చేరలేదు. కడుపులో పెద్దగా సమస్య లేకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేసింది. ఈమధ్య కడుపులో కొంచెం నొప్పి రావడంతో షెంజెన్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. కడుపులో కనిపించిన స్సూన్‌ను ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ సన్ తింగ్జీ మాట్లాడుతూ కడుపులో ఉన్న స్పూన్ అడ్డంగా ఇరుక్కుపోయిందని, దాన్ని నిలువుగా వచ్చేలా చేసి నెమ్మదిగా గొంతు నుంచి బయటకు తీశామని తెలియజేసారు. కేవలం 10 నిమిషాల్లోనే చికిత్స పూర్తి చేసినట్లు తెలియజేసారు. మెటల్ స్పూన్ కావడం వల్ల కడుపులోని చిన్న ప్రేగు ఆంత్రమూలంలో వాపు ఏర్పడిందని తెలిపారు. చికిత్స తర్వాత లిలీ వేగంగానే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments