Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను క్రిమినల్ కావొచ్చు.. టీవీల్లో అందంగా ఉండే ఫోటోలు చూపించాలి

నేను క్రిమినల్ కావొచ్చు.. కానీ టీవీల్లో చూపించే నా ఫోటోలు అందంగా ఉండేలా చూడాలని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వింత కోరిక కోరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:28 IST)
నేను క్రిమినల్  కావొచ్చు.. కానీ టీవీల్లో చూపించే నా ఫోటోలు అందంగా ఉండేలా చూడాలని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వింత కోరిక కోరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆస్తికి సంబంధించి నేరానికి పాల్పడిందన్న కారణంగా అరెస్టయిన అమీ షార్ప్ గత వారంలో సిడ్నీలోని పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకుంది. ఆమెను వెతికే ప్రయత్నంలో పోలీసులు అందజేసిన ఒక ప్రకటనతో పాటు, ఆమెకు చెందిన రెండు ఫోటోలను టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి. 7 న్యూస్ టీవీ ఛానెల్ ఫేస్‌బుక్‌లో ఆ ఫోటోలు అప్‌లోడ్ చేశారు. ఈ కథనం, ఫోటోలపై మొదటగా స్పందించింది కూడా అమీ షార్పే కావడం విశేషం. 
 
'ఈ ఫోటోను ఉపయోగించండి... ప్లీజ్' అంటూ తన అభ్యర్థనను ఒక ఫోటోను కూడా జతచేసింది. టీవీ ఛానెల్స్ ప్రసారం చేసిన తన ఫోటో పేలవంగా ఉందని కూడా వాపోయింది. అమీ షార్ప్ అభ్యర్థనపై నెటిజన్ల నుంచి పెద్దఎత్తున స్పందనలు వచ్చాయి. 'ఆహా ఎలాంటి కళాత్మకమైన ఆలోచన. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులకు ఇదో కొత్త మార్గం కావచ్చు. అత్యంత పేలవంగా ఉన్న ఫోటోలు ప్రచురిస్తే నేరస్థులు తమంత తాముగా బయటకు వస్తారు. వారిని పట్టుకోవడం సులువు అవుతుంది కూడా' అని ఫేస్ బుక్ యూజర్ బెస్ సేక్‌విల్లే కామెంట్‌ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments