Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:37 IST)
ఓ మహిళ పిచ్చి ప్రవర్తన కారణంగా విమానాశ్రయంలో హడావుడి చోటుచేసుకుంది. ఆమెను ఎక్కిన ఫ్లైటు దించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విక్టోరియా దేశానికి చెందిన రిచెల్లీ మారిస్సా(42) అనే మహిళ వర్జిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కే సమయంలో తన బ్యాగ్‌లో బాంబు ఉందని, అధికారులను, ప్రయాణీకులను హడలెత్తించింది. వెంటనే పోలీసులు ఆమె లగేజీని తనిఖీ చేశారు. తాను సరదాగా జోక్ చేసానని చెప్పింది.  
 
అలా చెబితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఈ పని చేశానని చెప్పింది. దీనికి సీరియస్ అయిన అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఓ కారు డ్రైవరు తనకు ఈ జోక్ చెప్పాడని అందుకే విమానం ఎక్కే ముందు ఆ విధంగా ప్రవర్తించానని మహిళ కోర్టులో చెప్పింది. ఎవరో చెప్పారని చట్టంతో చలాగాటాలాడటం నేరమని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. 
 
గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఆమె కోర్టులో నేరాన్ని అంగీకరించి విమానాశ్రయ అధికారులకు క్షమాపణ చెప్పింది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకే ఇలా ప్రవర్తించిందని గుర్తించిన కోర్టు ఆమెకు 800 డాలర్ల జరిమానా విధించి వదిలేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments