Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్‌లో చేరిన హైదరాబాద్ యువతి.. 2 నెలలుండి..?

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:26 IST)
ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న టెర్రరిస్ట్ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో హైదరాబాద్‌కు చెందిన యువతి చేరినట్లు తెలంగాణ నిఘా విభాగం గుర్తించింది. ఇరాక్ చేరుకొన్న ఆ యువతి రెండు నెలలు మాత్రమే అక్కడ ఉండి ఇటీవలే తిరిగి వచ్చినట్లు తెలియడంతో, ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం ఆమెను విచారిస్తున్నట్టు సమాచారం. 
 
ఆ యువతి కుటుంబం పదేళ్ళ కిత్రం హైదరాబాద్ నుంచి దోహా వెళ్లి స్థిరపడినట్టు సమాచారం. దోహాలో ఉంటున్న 19 ఏళ్ళ ఆ యువతి ఐఎస్‌ఐఎస్‌‌లో చేరి, రెండు నెలల పాటు ఇరాక్‌లో పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న ఒక మధ్య వయస్కురాలితో పరిచయం పెంచుకున్న ఈ యువతి ఐఎస్ తరఫున యుద్ధంలో పాల్గొనాలన్న ఉత్సుకతతో ఇరాక్ వెళ్లింది.

అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను వంటచేసి పెట్టడం వంటి పనులకే పరిమితం చేయడంతో విసుగెత్తి, తమ కుటుంబ సభ్యులను సంప్రదించింది. వారు చొరవ తీసుకొని ఇటీవల తమ కుమార్తెను తెచ్చుకొన్నారు. ఐఎస్‌ఐఎస్‌‌పై నిఘా కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments