Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢంగా ప్రేమించిన ప్రియుడికి ఎయిడ్స్ ఉందని తెలిసి.. ప్రేయసి ఏం చేసిందంటే..?

గాఢంగా ప్రేమించిన ప్రియుడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో ప్రియురాలు అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సైకిల్లో వెళ్తున్న అతడిని కారుతో ఢీకొట్టింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:47 IST)
గాఢంగా ప్రేమించిన ప్రియుడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో ప్రియురాలు అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సైకిల్లో వెళ్తున్న అతడిని కారుతో ఢీకొట్టింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అరిజోనాలోని పోనిక్స్లో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే... మిస్టీ లీ విక్కీ అనే మహిళ... తన ప్రియుడికి ఎయిడ్స్ ఉందనే విషయం తెలుసుకుని లోలోన రగిలిపోయింది. 
 
ఎలాగైనా అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే ఒకరోజు సైకిల్‌పై వెళ్తున్నఅతడిని కారుతో గుద్దేసింది. దీంతో బంతి ఎగిరినట్టు గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తు ఎగిరి కుప్పకూలిపడ్డాడు. స్పృహ కోల్పోయిన అతడు కొద్ది నిమిషాల తర్వాత తేరుకుని మెల్లగా లేచి కొద్ది దూరం నడిచి మరోసారి కుప్పకూలాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
 
సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డు కావడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు. మిస్టీ లీ విక్కీ అనే మహిళ ఆరోజు కారు నడిపిందని, ఆమె ఆ సైక్లిస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని పోలీసులు నిర్ధారించారు. మరి ఎందుకు అలా చేసిందని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. 
 
పోలీసుల విచారణలో అతడికి హెచ్ఐవీ ఉందని, ఆ విషయం తనతో చెప్పలేదనే ఆగ్రహంతో అతడిని చంపేయాలనుకున్నానని అంగీకరించింది. ఈ మేరకు పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments