Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో కలిసి టూర్ కెళ్లాలనుకున్న భార్య... సాధ్యపడక పోవడంతో శవంతో రోడ్ జర్నీ!

భర్తతో కలిసి టూర్‌కు వెళ్లాలని ఆ భార్య భావించింది. అయితే, అది సాధ్యపడక పోవడంతో అతని శవంతో టూర్‌కు బయలుదేరింది.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (12:52 IST)
భర్తతో కలిసి టూర్‌కు వెళ్లాలని ఆ భార్య భావించింది. అయితే, అది సాధ్యపడక పోవడంతో అతని శవంతో టూర్‌కు బయలుదేరింది. అయితే, కుళ్లిన శవం నుంచి దుర్వాసన అధికంగా రావడంతో గుర్తించిన ఓ ప్రాంతం వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమెరికా, అలస్కాకు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి కొన్నిరోజులు ప్రయాణాలు చేయాలని భావించింది. అయితే, 78 యేళ్ళ వయసున్న భర్త అందుకు ససేమిరా అన్నారు. ఇంతలో ఆయన చనిపోయాడు. దీంతో తన అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త శవంతో టూర్‌కు బయలుదేరింది. భర్త మృతదేహాన్ని వాహనంలో పెట్టుకొని రోడ్డు ప్రయాణాలు చేసింది. 78 ఏళ్ల తన భర్త మృతదేహాన్ని ఓ అల్యూమినియం శవపేటికలో పెట్టుకొని.. తను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లింది. శవం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఎప్పుడూ ఐస్‌ను వినియోగించింది. 
 
అయితే, అమెరికాలోని అలస్కాలో ఆమె శవంతో తిరుగుతుండటంతో కొందరు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త సహజంగానే మరణించారని, ఈ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి అభియోగాలు మోపలేదని పోలీసు అధికారి చెప్పారు. ఆమె భర్త శవాన్ని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న మార్చురీకి తరలించామని, మళ్లీ తన భర్త శవం కోసం ఆమె రాబోదని ఆశిస్తున్నామని తెలిపారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments