Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ సునామీలా విరుచుకుపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. అందువల్ల ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోరాదని కోరారు. భారత్‌లో ఇప్పటికే 1200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసులు సాధారణంగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో ఉప్పెనలా పెరగనున్నాయని తెలిపారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఇదే జరిగితే భారత్‌లో మాత్రం మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్యతో పాటు.. ఆస్పత్రుల్లో చేరే ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అందువల్ల అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ను ప్రతి  ఒక్కరూ సాధారణ జలుబులా తీసుకుంటున్నారని, ఇదే పెను ముప్పుకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments