Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్ర దేశంగా పాకిస్థాన్? ఆన్‌లైన్‌లో లక్ష సంతకాలు.. 60 రోజుల్లో ఒబామా స్పందిస్తారా?

యూరి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పటికే భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ప్రపంచ దేశా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (18:14 IST)
యూరి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పటికే భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ప్రపంచ దేశాలు సైతం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా ప్రకటించాలంటూ అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హాస్‌కు ఆన్‌లైన్ పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇలా వచ్చిపడే పిటిషన్ల సంఖ్య ఇప్పటికే లక్ష దాటడంతో ఒబామా పాలకవర్గం దీనిపై రెండు నెలల్లో స్పందించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూరీ సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదుల దాడి ఘటనపై అమెరికాలోని భారతీయులు తీవ్రంగా స్పందించారు. భారత్ ఐరాస సాక్షిగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తుందని ఏకిపారేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న వైట్ హౌస్ ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించగా వారం రోజుల్లో లక్షా పది వేల మంది సంతకం చేశారు. 
 
పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని కోరుతూ అమెరికాలోని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఇటీవల ఓ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిటిషన్లపై సంతకాలు, పాకిస్థాన్‌కు వ్యతిరేక బిల్లులు ప్రవేశపెట్టిన తరుణంలో ఒబామా ఈ వ్యవహారంపై ఎలా స్పందింస్తారోనని ప్రపంచ దేశాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments