Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న అమెరికా... టిక్ టాక్ నుంచి ప్రారంభం...

Webdunia
గురువారం, 9 జులై 2020 (15:21 IST)
చైనాపై కఠిన చర్యలకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఈ చర్యల్లో భాగంగా, తొలుత టిక్ టాక్‌తో పాటు చైనాకు చెందిన పలు యాప్స్‌పై నిషేధం విధించాలని భావిస్తోంది. 
 
ఇదే అంశంపై శ్వేతసౌథం ప్రెస్ కార్యదర్శి కేలే మెకానీ స్పందించారు.''చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను' అని పేర్కొన్నారు.
 
కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అక్కడ దాదాపు 30 లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు లక్షన్నరకు పైగా కోవిడ్‌ మరణాలు సంభవించాయి. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మహమ్మారి గురించి ముందే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, డ్రాగన్‌కు మద్దతుగా నిలిచారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం నుంచి డబ్ల్యూహెచ్‌ఓకు అందే నిధులు సైతం నిలిపివేశారు.
 
అదేవిధంగా గత కొన్ని నెలలుగా అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ.. ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్‌పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసేలా చైనా అక్కడ ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టంపై విరుచకుపడింది. 
 
ఈ నేపథ్యంలో హాంకాంగ్‌కు అమెరికా కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ట్రంప్‌ ఇంతకుముందే స్పష్టంచేశారు. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత  ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 
 
అలాగే, జాతీయ భద్రత, ప్రజల గోప్యత హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున టిక్‌టాక్‌, వీచాట్‌ తదితర చైనా యాప్‌లపై నిషేధం విధించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సంకేతాలు ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments