Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్ పాక్‌లో ఏమైనా గుడ్లు పెడుతున్నాడా?.. పీఎంఎల్-ఎన్ ఎంపీ ప్రశ్న.. నవాజ్ షరీఫ్ షాక్

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు చెందిన ఎంపీ రానా మహ్మద్ అఫ్జల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్‌లో

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (14:33 IST)
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు చెందిన ఎంపీ రానా మహ్మద్ అఫ్జల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్‌లో హఫీజ్ ఏమైనా గుడ్లు పెడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆర్మీ సర్జికల్ దాడులు చేయడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాకిస్థాన్‌ను అంత‌ర్జాతీయంగా ఒంట‌రి చేయాల‌ని భార‌త్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. పాక్ ఉగ్ర‌వాదంపై భార‌త్‌తో పాటు ప‌లు దేశాలు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌స్తున్నాయి.
 
అదేసమయంలో పాకిస్థాన్ ప్ర‌స్తుతం త‌మ సొంత దేశ నేత‌ల నుంచి కూడా విమ‌ర్శ‌లు వచ్చాయి. త‌మ‌ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి మ‌రీ పాక్‌ను ఆ దేశ నేత‌లు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానా మహ్మద్ అఫ్జల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్పై ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవాలని అఫ్జల్ అన్నారు. హఫీజ్ పాక్‌లో ఏమైనా గుడ్లు పెడుతున్నాడా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. భారత్‌లో జ‌రుగుతున్న ఉగ్ర‌దాడుల వెనుక‌ హఫీజ్ ఉన్నాడంటూ ఆరోపణలు వ‌స్తోన్నా ఆ ఉగ్ర‌వాదిపై చర్యలు తీసుకోవడంలో త‌మ దేశ‌ ప్రభుత్వం విఫలమైందని ఆయ‌న విమ‌ర్శించారు.
 
విదేశీ వ్యవహారాల్లో త‌మ దేశం పాటిస్తోన్న తీరును కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. హఫీజ్ ఉగ్రవాది అని భారత్ అంత‌ర్జాతీయంగా వెల్లడించిందని ఆయ‌న పేర్కొన్నారు. హ‌ఫీజ్ విషయంలో పాక్ ఎంతో క‌ఠిన వైఖ‌రి అవ‌లంబించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టి పాక్ను ఉగ్ర‌వాద దేశంగా ప్రకటించాల‌నుకుంటున్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేస్తే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments