వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ సర్వర్లు డౌన్‌

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (09:32 IST)
వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల నెట్‌వర్కింగ్‌ సేవలు శుక్రవారం రాత్రి చాలాసేపు డౌన్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇబ్బందులకు గురైన వారిలో 12 లక్షల మందికి పైగా ఆయా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాజమాన్యాలకు ఫిర్యాదు చేశారు. సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక తలలు పట్టుకున్నారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్‌డేట్‌ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్‌ కూడా కాలేకపోయారు. ఎర్రర్‌ అనే సందేశం కనిపించడం చూసి తలలు పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

సర్వర్‌ డౌన్‌ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ 'డౌన్‌ డిటెక్టర్‌' గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments