ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (12:31 IST)
భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళకు వింత అనుభవైంది. ఆన్‌లైన్‌లో సూప్ ఆర్డర్ చేస్తే.. సూప్‌తో పాటు మొబైల్ ఫోన్ కూడా వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అడిలైడ్ నగరంలో నివసించే శ్రద్ధ అనే మహిళ గతవారం ఓ హాట్పాట్ టేక్అవే షాపు నుంచి నూడిల్స్ సూప్ ఆర్డర్ చేశారు. కొంత అక్కడే తిని, మిగిలింది ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఆ హాట్పాట్ తింటుండగా, కంటైనర్ అడుగున ఏదో తేడాగా అనిపించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ విషయాన్ని శ్రద్ధ స్వయంగా ఓ టిక్టాక్ వీడియోలో పంచుకున్నారు, అది కాస్త వైరల్‌గా మారింది.
 
'నేను కంటైనర్ అడుగున గరిటెతో తీస్తుంటే ఏదో వింతగా తగిలింది అని వీడియోలో తెలిపారు. ఇంకాస్త లోతుగా చూడగా, కంటైనర్ అడుగున పనిచేస్తున్న ఫోన్ కనిపించింది, సూప్ లోంచి ఫోన్‌ను బయటకు తీసినప్పుడు, దాని స్క్రీన్‌పై టెంపరేచర్ వార్నింగ్ కనిపించిందని, సాధారణంగా పరికరాలు వేడెక్కినప్పుడు ఇలాంటి హెచ్చరిక వస్తుందని ఆమె చెప్పారు.
 
ఆశ్చర్యకరంగా, ఈ ఘటనపై శ్రద్ధ రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. "నేను వెంటనే రెస్టారెంట్ ఫోన్ చేసి, 'హే, నా హాట్పాట్లో ఓ ఫోన్ దొరికింది' అని చెప్పాను. దానికి వాళ్లు, 'ఓ అవునా, మా చెఫ్స్ ఒకరి ఫోన్ కనపడట్లేదు' అన్నారు అని శ్రద్ధ తెలిపారు. 
 
'వాళ్లు పదే పదే క్షమాపణలు చెప్పారు, నేను 'ఫర్వాలేదు, నేను దాన్ని తిరిగి తీసుకొస్తాను' అని చెప్పాను. తప్పులు ఎవరైనా చేస్తారని చెబుతూ, ఆమె రెస్టారెంట్ పేరును వెల్లడించలేదు.
 
పొరపాటున చెఫ్ తన ఫోనును టేక్ అవే కంటైనర్‌లో పెట్టి ఉంటారని, అది నల్లగా ఉండటం వల్ల ఆహారం ప్యాక్ చేసిన వ్యక్తి దానిని గమనించి ఉండకపోవచ్చని శ్రద్ధ వివరించారు. 
 
"నేను హాట్పాట్ కోసం మొదట 35 డాలర్లు చెల్లించాను. వాళ్లు నాకు 50 ఇచ్చారు. అంతేకాకుండా, చెఫ్ 'మీరు తదుపరిసారి వచ్చినప్పుడు చెప్పండి, మీకు ఉచితంగా హాట్పాట్ ఇస్తాను' అని చెప్పారు" అని శ్రద్ధ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments