Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరకలి : మృతదేహాల గుట్టలు.. నేలకూలిన భవనాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:07 IST)
ఇండోనేషియాలో ఘోరకలి సంభవించింది. సునామీ ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా సునామీ విరుచుకుపడటంతో ఏకంగా 168 మంది వరకు మృత్యువతాపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేనా, ఎటు చూసినా నేలకూలిన భవనాలు, గుట్టలు గుట్టులుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అనేక మంది క్షతగాత్రులు రక్తమోడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సునామీ సృష్టించిన విధ్వంసంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్ధిర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విలయం కారణంగా 168 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలో బీచ్‌ల్లో సునామీ సంభించిందని.. క్రాకటోవో దీవిలోని అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ విపత్తు వచ్చిందని తెలిపారు. లావా.. బూడిద 500 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిందని, సునామీకి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments