Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని రోజుల్లోనే విశాఖ నుంచి పాలన : మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:10 IST)
మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ నగరానికి షిఫ్ట్ అవుతున్నారని, విశాఖ నుంచి పాలన సాగించే రోజులు నెలల నుంచి రోజుల్లోకి వచ్చిందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ బ్రాండ్ స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సదస్సు గురించి ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. 
 
ఈ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంవోయులు జరిగాయని తెలిపారు. తద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశంలోనే అధిక వనరులు ఉన్న విశాఖ నగరం మనకు ఉండటం ఎంతో అదృష్టమన్నారు. 
 
పెట్టుబడుల సదస్సు తర్వాత అయినా ప్రతిపక్ష పార్టీలో మార్పు వస్తుందని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విండ్ లేదా సోలార్ పవర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి అమర్నాథ్ సలహా ఇచ్చారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ వస్తారని మంత్రి చెప్పారు. 
 
గతంలో డిల్లీలో స్వయంగా జగనే ఈ విషయాన్ని చెప్పారని వివరించారు. విశాఖకు జగన్ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని చెప్పారు. అనుకున్న సమయానికంటే ముందే విశాఖ నుంచి పాలన సాగబోతుందని మంత్రి అమర్నాథ్ వివరించారు. తదుపరి ప్రపంచ ఐటీ హబ్ విశాఖపట్టణమేనని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments