Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్‌పోర్టు రద్దు చేసి.. నన్ను అరెస్టు చేస్తే డబ్బెలా వస్తుంది : విజయ్ మాల్యా

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:12 IST)
పాస్‌పోర్టు రద్దు చేసి.. నన్ను అరెస్టు చేస్తే డబ్బెలా వస్తుందని యూబీ గ్రూపు మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనను ఉటంకిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించారు. భారత్‌లోని పలు జాతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేక లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్‌పోర్టును భారత విదేశాంగ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత చర్యను విజయ్ మాల్యా తప్పుబట్టారు. 
 
తాను తప్పనిసరి పరిస్థిల్లోనే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందనీ, రుణం మొత్తాన్ని చెల్లించడం మాత్రం తనతో అయ్యే పనికాదని, అలాగని రుణాన్ని ఎగ్గొట్టనని, తీసుకున్న రుణంలో తన శక్తి మేర చెల్లిస్తానంటూ ఇందుకు అన్ని బ్యాంకులు సహకరించాలని కోరారు. అసలు తాను దేశం విడిచి వెళ్లేలా అనేక పరిస్థితులు బలవంతం చేశాయన్నారు. అదేసమయంలో తన పాస్ పోర్టు రద్దు చేయడం ద్వారానే కాక, తనను అరెస్ట్ చేస్తే డబ్బెలా వస్తుందన్నారు. ఈ మేరకు.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ఫైనిన్షియల్ టైమ్స్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments