Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియా అధ్యక్ష భవనం 360 వయాగ్రా ట్యాబ్లెట్లు కొనుగోలు చేసిందా? ఎందుకో తెలుసా?

దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడిపోతున్న పార్క్ గ్వెన్.. కొత్త వివాదంలో చిక్కుకున్నారు. గ్వెన్ హ్వే కార్యాలయం వయాగ్రా

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (12:16 IST)
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడిపోతున్న పార్క్ గ్వెన్.. కొత్త వివాదంలో చిక్కుకున్నారు. గ్వెన్ హ్వే కార్యాలయం వయాగ్రా ట్యాబ్లెట్లు కొనడం నిజమేనని ప్రతిపక్ష ఎంపీ వ్యాఖ్యలు నిజమేనని.. ఒప్పుకోవడం వివాదానికి తెరదీసింది. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం తెలిపిన వివరాల ప్రకారం.... 360 వయాగ్రా ట్యాబ్లెట్లను కొనుగోలు చేశామని ప్రకటించింది. 
 
సాధారణంగా వయాగ్రా టాబ్లెట్లు ఆల్టిట్యూడ్‌ సిక్‌ నెస్‌‌ను నివారిస్తాయని నమ్ముతుండటం వల్ల పర్వతారోహకుల కోసం దక్షిణ కొరియా వైద్యులు వీటిని సిఫారసు చేస్తుంటారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది మే నెలలో అధ్యక్షురాలు ఇథియోపియా, ఉగాండా, కెన్యా పర్యటనలకు వెళ్లనున్నట్లు గ్వెన్ హ్వే కార్యాలయం ప్రకటించింది.
 
ఆ దేశాలు సముద్రమట్టం కంటే ఒకటి, రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉండటం ద్వారా అధ్యక్షురాలి సహాయక సిబ్బందికి... ఎత్తుకు సంబంధించిన రుగ్మత (ఆల్టిట్యూడ్‌ సిక్‌ నెస్‌) తలెత్తితే దానిని నివారించటం కోసం ఈ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. కొనుగోలు చేసిన ట్యాబ్లెట్లలో ఏ ఒక్కటీ ఇప్పటికీ వాడలేదని అధ్యక్ష భవనం బ్లూ హౌస్‌ ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments