Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌కు ఆరు వారాల గడువు... లేదంటే నిషేధమే : ట్రంప్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (12:35 IST)
చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు తనలోని అక్కసును వెళ్లగక్కాడు. చైనాకు చెందిన ప్రముఖ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్‌కు ఆయన డెడ్‌లైన్ విధించారు. ఆ యాప్‌ను తమ దేశంలోని ఏదేని కంపెనీకి విక్రయించాలని ఆదేశించారు. లేనిపక్షంలో నిషేధం తప్పదంటూ హెచ్చరించారు. ఇందుకోసం ఆరు వారాల గడువు విధించారు. 
 
ఇండోచైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనాకు చెందిన 59 సోషల్ మీడియా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అనేక ప్రపంచ దేశాలు కూడా ఈ యాప్‌లపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన యాప్‌లను నిషేధించాలంటూ అమెరికాలో డిమాండ్ పెరుగుతోంది. 
 
దీంతో తమ సంస్థ కార్యాలయాన్ని వేరే దేశానికి మార్చాలని టిక్‌టాక్‌ ప్రయత్నిస్తుండగా, టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు చేశారు.
 
తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అంటే సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. 
 
టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుంచి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌ యాప్ కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబరు 15లోపు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కూడా తెలిపిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments