Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (10:02 IST)
వచ్చే నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీకి దిగారు. అయితే, అనివార్య కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అదేసమయంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్‌ను ఎంపిక చేశారు. 
 
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీలో అంతర్గత ఆమోదం కోసం జరుగుతున్న ఓటింగ్లో ఆమె మెజారిటీ సాధించారు. మొత్తం 4000 మంది పార్టీ ప్రతినిధులు ఓటర్లుగా ఈ ఎన్నికల్లో రెండవ రోజు శుక్రవారం ఆమె మెజారిటీని దక్కించుకున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఏకైక అభ్యర్థిగా కమలా హ్యారీస్ నిలిచారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికలు మరో మూడు రోజులపాటు జరగనున్నాయి. ఫలితాన్ని అధికారికంగా ఈ నెలాఖరులో షికాగో వేదికగా జరగనున్న పార్టీ సమావేశంలో ప్రకటించనున్నారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీపడనుండడం గౌరవంగా భావిస్తున్నానని ఈ ఈ సందర్భంగా కమలా హ్యారీస్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మెజారిటీ ఓట్లు సాధించారు. ఎన్నికల రేసు నుంచి అధ్యక్షుడు జో బిడెన్ వైదొలగిన తర్వాత పార్టీపై కమలా హ్యారీస్ పూర్తి నియంత్రణ సాధించారు. పార్టీకి చెందిన ఇతర నేతలెవరూ అభ్యర్థిత్వం కోసం ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను ఖరారు చేసుకోబోతున్న మొట్టమొదటి నల్లజాతీయురాలిగా, దక్షిణాసియా మహిళగా ఆమె నిలవడ లాంఛనప్రాయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments