Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సైన్యంలో కామాంధులు... బాలికలను సెక్స్ వర్కర్లుగా మార్చేస్తున్నారు...

పాకిస్తాన్ సైన్యంలో కామాంధులు వున్నారని పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ ఖటక్ అన్నారు. పాకిస్తాన్ లోని వజీరిస్తాన్, స్వాత్ లోయల్లో పాక్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతోందనీ, ఆ ప్రాంతాల్లోని బాలికలను కిడ్నాప్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన వా

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (18:00 IST)
పాకిస్తాన్ సైన్యంలో కామాంధులు వున్నారని పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ ఖటక్ అన్నారు. పాకిస్తాన్ లోని వజీరిస్తాన్, స్వాత్ లోయల్లో పాక్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతోందనీ, ఆ ప్రాంతాల్లోని బాలికలను కిడ్నాప్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన వారిని సెక్స్ వర్కర్లుగా మార్చేస్తున్నారనీ, ఎదురుతిరిగే వారి ఇళ్లను కూల్చివేసి వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ ప్రాంత ప్రజలను హింసించి, భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టేసి, తీవ్రవాదుల స్థావరాలను ఏర్పాటు చేసేందుకు పాక్ సైన్యం సన్నాహం చేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక అక్కడి ప్రజలు ఆ ప్రాంతాలను వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ వలస వెళ్లిపోతున్నారనీ, ఈ సంఖ్య సుమారు 5 లక్షల వరకూ ఉంటుందని వెల్లడించారు.
 
పాకిస్తాన్ సైన్యం చేష్టలు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనీ, వారివద్ద వున్న అణ్వాయుధాలను చెడ్డ దేశాలకు అమ్ముతూ బ్లాక్ మార్కెట్లా మారిందని మండిపడ్డారు. పాకిస్తాన్ ఆగడాలను ఎదుర్కొనేందుకు తాము పస్తూనిస్తాన్ లిబరేషన్ ఆర్మీని స్థాపించి వారి పని పడుతామని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం