Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు - రిషి సునక్ గెలిచేనా?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:16 IST)
బ్రిటన్ దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత కొన్ని రోజులుగా సాగుతూ వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునక్, ఆ దేశ మాజీమంత్రి లిజ్ ట్రస్‌లు తుదిపోరులో నిలిచారు. 
 
ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. అయితే, బ్రిటన్ మీడియా వర్గాల సమాచారం మేరకు లిజ్ ట్రస్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరి భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు శుక్రవారం సాయంత్రంతో ముగిసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 1.60 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉండగా వీరంతా ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments