Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో రసాయన దాడి... క్షిపణులతో విరుచుకుపడిన అమెరికా సైన్యం

సిరియాపై ప్రపంచ పెద్దన్న కన్నెర్ర జేసింది. సిరియాలోని ఖాన్‌షిఖావున్ నగరంపై జరిగిన రసాయన దాడిలో మొత్తం 70 మందికి పైగా చనిపోగా... అందులో చాలామంది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండటంతో ప్రపంచం యావత్తూ కలవరప

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (09:42 IST)
సిరియాపై ప్రపంచ పెద్దన్న కన్నెర్ర జేసింది. సిరియాలోని ఖాన్‌షిఖావున్ నగరంపై జరిగిన రసాయన దాడిలో మొత్తం 70 మందికి పైగా చనిపోగా... అందులో చాలామంది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండటంతో ప్రపంచం యావత్తూ కలవరపాటుకు గురైంది. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా... ప్రత్యక్ష కార్యాచరణంలోకి దిగింది. 
 
అయితే, సిరియాలో తిరుగుబాటు శిబిరాలపై రసాయన దాడుల పాపం ఆ దేశ అధ్యక్షుడు చేసిన పనేనని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సిరియా వైమానిక స్థావరాలపై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. సిరియా అధ్యక్షుడి నేతృత్వంలో నడిచే ఈ వైమానిక స్థావరం నుంచే రసాయన దాడులు జరగడం గమనార్హం. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు క్షిపణిదాడులు ప్రారంభించినట్టు అమెరికా సైనికాధికారి ఒకరు వెల్లడించారు. మధ్యదరాసముద్రంలో అమెరికా యుద్ధ నౌక నుంచి మొత్తం 50 వరకు తోమాహక్ క్షిపణులను సిరియా పైకి ప్రయోగించినట్టు చెప్పారు. 
 
కాగా ఈ క్షిపణి దాడుల్లో ఎంత మంది చనిపోయారు, ఎలాంటి నష్టం జరిగిందన్న దానిపై వివరాలు రావాల్సి ఉంది. గత మూడు రోజుల క్రితం తిరుగుబాటు దారులపై సిరియాలో జరిగిన రసాయన దాడిపై అసద్‌ను తప్పు పట్టిన మరుసటి రోజే ట్రంప్ క్షిపణి దాడులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments