Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో 'కరోనా' అనే పదం ఉచ్ఛరిస్తే జైలుకే... ఎక్కడ?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (09:58 IST)
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. పలువా వంటి ద్వీపాల్లో మాత్రం కరోనా వైరస్ అడుగుపెట్టేందుకు భయపడుతున్నాయి. దీనికి కారణం ఆయా ద్వీపాలు గత జనవరి నుంచే కఠినమైన చర్యలు తీసుకున్నాయి. ఆంక్షలు కఠినతరం చేశాయి. రాకపోకలు బంద్ చేశాయి. ఫలితంగా పలువా వంటి ద్వీపాల్లో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా ఇంతవరకు నమోదు కాలేదు. 
 
ఇపుడు ప్రపంచ దేశాల్లో తుర్కెమెనిస్థాన్ ఒకటి. ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. అందుకే కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది. మీడియా వార్తల్లో, ఆరోగ్య శాఖ పంపిణీ చేసే సమాచార పత్రాల్లోనూ ఈ పదం కనిపించరాదని ఆదేశించింది.
 
ఇక ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. రహస్యంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది గమనించడమే వీరి విధి. వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే, ఇక అంతే. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుసు.
 
కాగా, ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం, ఇప్పటికే పౌర ఉద్యమాలను నిషేధించిన సర్కారు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడోవ్, తమ దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments