Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌కు ట్రంప్‌ బెదిరింపు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (08:31 IST)
సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. తాను ట్విట్టర్‌లో పెట్టిన ఒక పోస్టును ట్విట్టర్‌ సంస్థ మొదటిసారిగా ఫాస్ట్‌చెక్‌ చేసిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ 'సోషల్‌ మీడియా సంస్థలను గట్టిగా నియంత్రిస్తాం లేదా మూతపడేలా చేస్తాం' అని అన్నారు.

సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలు కన్సర్వేటివ్‌ల గొంతులను పూర్తిగా నొక్కేస్తున్నాయని రిపబ్లికన్లు అనుకుంటున్నారని, దీన్ని భవిష్యత్తులో కొనసాగేందుకు అనుమతించేది లేదని ట్రంప్‌ బెదిరించారు. మంగళవారం ట్రంప్‌ చేసిన ఒక పోస్టుకు ట్విట్టర్‌ సంస్థ 'వార్నింగ్‌ లేబుల్‌'ను జతచేసింది.

పోలింగ్‌ సమయంలో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ల ద్వారా ఓటర్లకు మోసం జరుగుతుందంటూ ట్రంప్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్త్తున్నారని పాఠకులను హెచ్చరించింది. సోషల్‌ మీడియా సంస్థలను మూసివేస్తామని ట్రంప్‌ ఏ అధికారంతో చెబుతున్నారో స్పష్టత లేదని స్థానిక మీడియా పేర్కొంది.

ట్రంప్‌ ఆరోపణలను ట్విట్టర్‌ సంస్థ ఒక ప్రకటనలో తోసిపుచ్చింది. ట్రంప్‌ వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చామని అది పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments