ట్రంప్‌కు ఎర్త్ పెట్టిన ట్విట్టర్.. ఫేస్‌బుక్ తరహాలోనే గండి కొట్టింది..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (09:47 IST)
అమెరికా అధ్యక్షుడిగా పెత్తనం చెలాయించిన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి దారుణంగా మారింది. ఇన్నాళ్లూ అధ్యక్ష పదవి వెలగబెట్టి... అడ్డమైన ట్వీట్లు పెడుతూ... ఎన్నోసార్లు ట్విట్టర్ ద్వారా అభ్యంతరాలు ఎదుర్కొన్న ట్రంప్... ఇప్పుడు శాశ్వతంగా ట్విట్టర్‌కి దూరమయ్యారు. ఆయన ఎకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్రంప్ రూల్స్‌ని అతిక్రమించారనీ... అందువల్లే ఈ చర్య తీసుకుంటున్నామని చెప్పింది ట్విట్టర్ యాజమాన్యం. అమెరికాలో ఏ అధ్యక్షుడికీ ఇంత ఘోర అవమానం జరగలేదని టాక్ నడుస్తోంది. 
 
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లెక్కలేనన్ని వివాదాస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయన అలా చెలరేగిపోతుంటే... అమెరికా అధ్యక్షుడు కదా అని ఇన్నాళ్లూ ట్విట్టర్ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఎప్పుడైనా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్‌ను అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. ట్రంప్ రెక్కలు విరిగాయి. అంతే ట్విట్టర్‌కి ఎక్కడ లేని బలం వచ్చేసింది. రివర్స్ కౌంటర్ యాక్షన్ షురూ చేసింది.
 
అమెరికా క్యాపిటల్‌లో జరిగిన ఘర్షణలపై ట్రంప్ జనవరి 8న పెట్టిన ట్వీట్‌పై అభ్యంతరం చెబుతూ ట్విట్టర్ ఆయన అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. అంతకంటే ముందు ఫేస్‌బుక్... ట్రంప్ ఎకౌంట్‌ను జనవరి 20 నుంచి సస్పెండ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments