Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి ట్రంప్ ఫోన్... ఫోన్‌ చేసిన తొలి ఐదుగురిలో ప్రధాని... భారత్ ట్రూ ఫ్రెండంటూ..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (08:57 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అధ్యక్షులు కావచ్చు.. ప్రధానులు కావచ్చు.. ఇప్పటి వరకూ నాలుగు దేశాల అధినేతలతో ట్రంప్‌ మాట్లాడారు. ఐదో దేశాధినేత మోడీనే. తద్వారా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. 
 
గత ఎన్నికల ప్రచారంలో కూడా ఇజ్రాయెల్‌తోపాటు మరికొన్ని దేశాలతోనే సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ట్రంప్‌ చెప్పారు. వాటిలో భారత ఒకటి. మోడీతో చర్చల సందర్భంగా, ద్వైపాక్షిక వాణిజ్యం, హెచ్‌1బీ వీసాలు, మేకిన్‌ ఇండియా, మేకిన్‌ అమెరికా, రక్షణతోపాటు ఇరువురి పర్యటనలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
 
ఇదిలావుండగా, అమెరికాలోని వివిధ కీలక పదవుల్లో ట్రంప్‌ కూడా భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు. నెట్‌ న్యూట్రాలిటీని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రవాస భారతీయుడు అజిత వరదరాజ్‌ పాయ్‌ను ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ చీఫ్‌గా నియమించారు. నికీ హెలీ, సీమా వర్మ, ప్రీత భరారా తర్వాత, ట్రంప్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో నియమితుడైన నాలుగో వ్యక్తి అజిత కావడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments