Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై మూన్ టూరిజం : ఐదు కంపెనీలతో నాసా ఒప్పందం

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:48 IST)
ఇప్పటికే స్పేస్ టూరిజం (అంతరిక్ష పర్యాటకం) విజయవంతమైంది. ఈ విభాగంలో మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్, జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌లు పోటీపడుతున్నాయి. తాజాగా మూన్ టూరిజం తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నాసా ఈ పర్యాటకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ సంస్థలు కూడా ఉన్నాయి. 
 
స్పేస్ టూరిజం విజయవంతం కావడంతో ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న 3,4 ఏళ్ళలో చంద్రుడిపైకి టూరిస్టులు వెళ్లనున్నారు. 
 
రెండు దిగ్గజాల కంపెనీలు చంద్రుడిపై పర్యాటకులను ల్యాండింగ్ చేయడానికి ల్యాండర్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. స్పేస్‌ఎక్స్‌లో ఇప్పటికే 8 మంది కస్టమర్లు ఉన్నారు. వారు చంద్రుడికి వెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.
 
మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్, జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌తో పాటు మరో మూడు కంపెనీలు ఈ గ్రూపులో ఉన్నాయి. చంద్రుడిపైకి సజావుగా ప్రయాణించడానికి ల్యాండర్లను తయారు చేయడానికి నాసా నుంచి రూ.1,078 కోట్ల ఒప్పందాన్ని అందుకున్నాయి. 
 
నాసా ఆర్టెమిస్ మిషన్ ప్రోగ్రామ్ లక్ష్యం.. చంద్రుడిపైకి మహిళతోపాటు ఒక నల్లజాతీయుడిని పంపడం. స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌తో ఒప్పందం చంద్రుడిపైకి వెళ్లేందుకు కొత్త మార్గాలను తెరిచేందుకు బలమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నదని నాసా హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ మేనేజర్ లిసా వాట్సన్ మోర్గాన్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments