చైనాలోని బోజ్‌హూ సిటీలో అతివేగం కారణంగా ఓ ఎలక్ట్రానిక్ ఆటో గుండ్రంగా తిరుగుతూ వాహనదారులను భయపెట్టింది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా అక్కడే
చైనాలోని బోజ్‌హూ సిటీలో అతివేగం కారణంగా ఓ ఎలక్ట్రానిక్ ఆటో గుండ్రంగా తిరుగుతూ వాహనదారులను భయపెట్టింది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా అక్కడే ఓ సర్కిల్‌పై తిరుగుతున్నట్లు గుండ్రంగా తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడి స్పృహ కోల్పోయాడు.
ఆ ఆటో మాత్రం అక్కడే అలాగే చుట్టూ తిరిగింది. దీంతో అక్కడి వాహనాదారులు జడుసుకున్నారు. ఇద్దరు పోలీసులు సహా అక్కడ వున్నవారంతా ఆ ఆటోను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా రిక్షా రింగులు తిరుగుతూ.. పోలీసులకు చుక్కలు చూపించిన వీడియోను ఓ లుక్కేయండి.