Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యుడికి వయసైపోతోంది.. ఆ శక్తిని కోల్పోతున్నాడట: నాసా

సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై జీవులకు ఎలా వృద్ధాప్య ఛాయలు వస్తాయో.. సూర్యుడికి కూడా అలానే వచ్చాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (18:13 IST)
సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై జీవులకు ఎలా వృద్ధాప్య ఛాయలు వస్తాయో.. సూర్యుడికి కూడా అలానే వచ్చాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 460కోట్ల ఏళ్ల క్రితం పుట్టిన సూర్యుడికి గ్రహాలు దూరంగా జరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
ఇందుకు బుధ గ్రహం కక్ష్యలో వచ్చిన మార్పులే నిదర్శనమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయాన్ని నాసా పంపిన ''మెసెంజర్'' అనే అంతరిక్ష నౌక వెల్లడించింది. ఈ నౌక మార్చి 2011 నుంచి ఏప్రిల్‌ 2015 మధ్య బుధగ్రహం చుట్టూ తిరుగుతూ పలు కీలక సందేశాలను భూమిపైకి పంపింది. ఐన్‌ స్టీన్‌ ప్రతిపాదించిన ''సాపేక్ష సిద్ధాంతాన్ని'' అన్వయిస్తూ మేసేంజర్‌ సందేశాలను పరిశీలించగా ఈ విషయం బహిర్గతం అయ్యింది.
 
ఇకపోతే.. సూర్యుని గురించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు.. 
సూర్యుని ఉపరితల వాతావరణం - 5,500 సెంటీ గ్రేడ్స్ ఉష్ణోగ్రత
సూర్యుని వయస్సు - 460 కోట్ల సంవత్సరాలు.
సూర్యమండలం యొక్క వ్యాసం – 1,392,684 కిలోమీటర్లు
సూర్యుని వెలుగు భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు.
సూర్యుడు ఒక సెకన్‌కు 220 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాడు.
సూర్యునికీ భూమికీ మధ్య దూరం సుమారు 15కోట్ల కిలోమీటర్లుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
సూర్యుడు భగభగ మండడానికి కారణం తనలోనున్న హైడ్రోజన్ అనే వాయువని.. ఆ హైడ్రోజన్‌లో సగం ఇప్పటికే మండిపోయిందని.. అది పూర్తిగా మండిపోతే సూర్యుడు అంతర్ధానమైపోతాడని.. దీనిప్రకారం సూర్యునికి ప్రస్తుతం మధ్య వయస్సు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments