గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకు న్యూయార్క్‌ శాండ్‌విచ్... యమ్మీ టేస్ట్‌తో అదుర్స్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (16:41 IST)
శాండ్ విచ్ అంటే ఇష్టపడని వారంటూ వుండరు. ఆహార ప్రియులకు శాండ్ విచ్‌లు అందించేందుకు రెస్టారెంట్లు పోటీ పడుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ శాండ్ విచ్‌ల తయారీలో ఫేమస్‌గా మారింది. అక్కడ విభిన్నమైన శాండ్ విచ్‌ల తయారీనే కాదు.. వాటి ధరలు కూడా బాగా ఎక్కవగానే ఉంటాయి. ఆ రెస్టారెంట్ రూపొందించిన ఓ శాండ్ విచ్ ప్రస్తుతం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది. 
 
వివరాల్లోకి వెళితే… న్యూయార్క్‌లోని స్రెండిప్టీ3 పేరుతో ఓ రెస్టారెంట్ శాండ్ విచ్‌లను తయారు చేయటంలో చాలా ఫేమస్. ఇక్కడ తయారయ్యే రుచికరమైన శాండ్ విచ్‌లను తినేందుకు దూరప్రాంతాల నుండి ఆహార ప్రియులు వస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని వెరైటీ శాండ్ విచ్‌లు ఇక్కడ లభిస్తాయి. అయితే తాజాగా ఈ రెస్టారెంట్ నిర్వాహకలు రూపొందించిన శాండ్ విచ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
 
ఇంతకీ దాని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఖరీదైన వెన్న క్వీన్ టెస్సెన్షియల్ గ్రిల్ల్డ్ చీజ్ ను ఈ శాండ్ విచ్ తయారీలో వాడతారు. దీనికి పైపూతగా గోల్డ్ ఫాయిల్ తో అలంకరిస్తారు. అందుకే ఈ శాండ్ విచ్ ఖరీదు 16వేల రూపాయలు. 
 
సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే శాండ్ విచ్ ల ఖరీదు 100 నుండి 200 రూపాయలు ఉంటాయి. గత ఏడేళ్ళ కాలంలో ఇంత ఖరీదైన శాండ్ విచ్ ను ఎవరూ తయారు చేయలేదు. దీంతో గిన్నీస్ బుక్ నిర్వాహకులు వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.
 
దీనిని తినాలనుకునే వారు 48 గంటల ముందుగా రెస్టారెంట్ కు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో వాడే పదార్ధాలన్నింటిని వివిధ ప్రాంతాల నుండి తెప్పించి ఆతరువా తయారీ మొదలు పెడతారు. క్విన్ టెస్సెన్షియల్ గ్రిల్డ్ ఛీజ్ లో ఫ్రెంచ్ పుల్లమాన్ షాంపెయిన్ బ్రెడ్ ముక్కలతోపాటు, డోమ్ పెరిగ్నాన్ షాంపెయిన్ ట్రాఫల్ బటర్ వాడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments