Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉనికిలోనే లేని సంస్థపై నిషేధం.. యూరప్‌లో ఎత్తివేత. భారత్‌లో ఇంకా ఎందుకు?

2009లో భూమ్మీద నుంచి శాశ్వతంగా కనుమరుగైపోయిన జాతి పోరాట సంస్థ ఎల్టీటీటీఈపై నేటివరకు కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ యూరప్‌లోని 26 దేశాలు నిర్ణయించిన నేపధ్యంలో భారతదేశంలో ఆ సంస్థపై కొనసాగుతున్న నిష

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (08:21 IST)
2009లో భూమ్మీద నుంచి శాశ్వతంగా కనుమరుగైపోయిన జాతి పోరాట సంస్థ ఎల్టీటీటీఈపై నేటివరకు కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ యూరప్‌లోని 26 దేశాలు నిర్ణయించిన నేపధ్యంలో భారతదేశంలో ఆ సంస్థపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళరాజకీయ పార్టీలు జోరు పెంచాయి. వీరికి మద్దతుగా ఈలం సానుభూతిపరులు, తమిళ అభిమాన సంఘాలు రంగంలోకి దిగడంతో తమిళనాడులో వివాదం రాజుకుంటోంది. 
 
ఈలం తమిళుల సంక్షేమం  లక్ష్యంగా శ్రీలంక కేంద్రంగా ఎల్‌టీటీఈ కార్యకలపాలు ఏళ్ల తరబడి సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.  1991లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యలో ఎల్‌టీటీఈల హస్తం వెలుగులోకి రావడంతో, వారిని ఉక్కుపాదంతో అణచి వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. శ్రీలంకతో కలిసి ఎల్‌టీటీఈలను టార్గెట్‌ చేసింది. భారత్‌లో ఆ సంస్థపై నిషేధం విధించారు. అలాగే, భారత్‌ ఒత్తిడి మేరకు  ఐరోపా యూనియన్‌తో పాటుగా ఇంగ్లాండ్‌ తదితర దేశాలు సైతం ఎల్‌టీటీఈలకు నిషేధం విధించాయి.  
 
ఈ నిషేధాన్ని ప్రపంచంలోని తమిళులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఎల్‌టీటీఈ మద్దతు దారులు, పార్టీలు, సంఘాలు పోరాటాలు సైతం సాగిస్తున్నాయి. ఎండీఎంకే నేత వైగో అయితే, ఈ నిషేధం ఎత్తివేతకు పట్టబడుతూ ఏళ్ల తరబడి ట్రిబ్యునల్‌ ముందుకు తన వాదన వినిపిస్తూ వస్తున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన వైగో స్వయంగా కోర్టుకు హాజరై మరి వాదిస్తున్నారు. ఐరోపా యూనియన్‌లో తాజాగా ఎల్టీటీఈపై నిషేధం ఎత్తివేతను పరిగణనలోకి తీసుకుని భారత్‌లోనూ నిషేధం ఎత్తివేత నినాదంతో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఒత్తిడికి ఎండీఎంకే, పీఎంకేలు సిద్ధం అయ్యాయి. ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు రంగంలోకి దిగాయి. 
 
ఎల్‌టీటీఈలపై విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ఐరోపా కోర్టు ఇచ్చిన తీర్పు తమిళుల్లో ఆనందాన్ని నింపాయి. ఆ యూనియన్‌లోని 26 దేశాల్లో ఎల్‌టీటీఈలకు ఉన్న నిషేధం తొలగడంతో, ఆ సానుభూతి పరులు, మద్దతు తమిళులు ఇక, స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును ఆసరాగా చేసుకుని, భారత్‌లోనూ నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలన్న నినాదం తెరమీదకు వచ్చింది. ఐరోపాను ఆదర్శంగా చేసుకుని నిషేధం ఎత్తివేయాలన్న నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి ఈలం మద్దతు పార్టీలు, సంఘాలు సిద్ధం అయ్యాయి.
 
ఈ విషయంగా వైగో మీడియాతో మాట్లాడుతూ, యుద్ధం పేరుతో తమిళుల్ని మారణహోమంలో శ్రీలంక అతి దారుణంగా హతమార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎల్‌టీటీఈలు లేరన్న విషయాన్ని ఆ దేశమే ప్రకటించి ఉన్నదని, అయితే, భారత్‌లో మాత్రం నేటికీ ఇంకా నిషేధం కొనసాగడం శోచనీయమని మండిపడ్డారు. ఈ నిషేధం ఎత్తి వేతకు పట్టుబడుతూ తమిళాభిమానులు, ఈలం మద్దతు సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, భారత్‌లోనూ నిషేధం ఎత్తి వేయాల్సిన అవసరం ఉందన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం