Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో నల్గొండ వైద్యుడితో మాట్లాడుతూ.. రోగే కత్తితో పొడిచేశాడు..

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్య

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:55 IST)
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్యుతారెడ్డిపై ఓ దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో అచ్యుతారెడ్డి అక్కడికక్కడే తీవ్రగాయాలతో మరణించాడు. 
 
అచ్యుతారెడ్డి మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కత్తితో పొడిచిన దుండగుడు కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు. 
 
హత్యకు గురైన అచ్యుతా రెడ్డి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన వారని, ఆయన ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 
 
అచ్యుతారెడ్డి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా వున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇదే కాన్సాస్ నగరంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూఛిబొట్ల అమెరికాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments