Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అలా చేస్తే చూస్తూ ఊరుకోం.. తాలిబన్లు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (13:20 IST)
తాలిబ‌న్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘ‌న్ ప్రాంతాల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకుంది. కాబూల్ మిన‌హా మిగ‌తా భూభాగాల‌ను ఇప్ప‌టికే తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబ‌న్‌, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వాల మ‌ధ్య సంధికి ఖ‌తార్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అధికారాన్ని తాలిబ‌న్ల‌తో క‌లిసి పంచుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది.
 
ఇక, తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని తాము గుర్తించ‌బోమ‌ని ఇండియాతో స‌హా 12 దేశాలు స్ప‌ష్టం చేశాయి. ఇదిలా ఉంటే, తాలిబ‌న్ నేత‌లు ఇండియాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆఫ్ఘ‌న్ అభివృద్ధి కోసం భార‌త ప్ర‌భుత్వం చాలా స‌హాయం చేసింద‌ని, దేశంలో రోడ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణం, జాతీయ ప్రాజెక్టుల‌ను నిర్మించిందని నేత‌లు పేర్కొన్నారు.
 
దేశ‌ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ భార‌త్‌కు రుణ‌ప‌డి ఉంటార‌ని, కానీ, త‌మ‌కు వ్య‌తిరేకంగా మిలిట‌రీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త్ భావిస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని తాలిబ‌న్ నేత‌లు హెచ్చ‌రించారు. తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా భార‌త్‌తో మిత్రుత్వాన్ని కోరుకుంటుంద‌ని, శ‌తృవుగా చూడ‌ద‌ని తాలిబ‌న్ నేత‌లు స్ప‌ష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments