Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌ : అధ్యషుడు అష్రఫ్ ఘనీ రాజీనామా

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (17:51 IST)
తాలిబన్ తీవ్రవాదులు అనుకున్నంతపని చేశాయి. ఆప్ఘనిస్థాన్ దేశాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ దేశం నుంచి అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ తీవ్రవాదులకు పట్టుదొరికింది. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ వచ్చిన తాలిబన్ తీవ్రవాదు.. ఆదివారం ఆ దేశ రాజధాని కాబూల్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తాలిబన్లు శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి బంగ్లాదేశ్‌కు బయల్దేరారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల వార్తా సంస్థ ధ్రువీకరించింది.
 
మరోవైపు, తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. 
 
అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్‌లోకి ప్రవేశించినట్టు వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments