Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన తాజ్‌కు ఆసియా కట్టడాల్లో రెండో స్థానం... దిగజారిన గ్రేట్ వాల్

ప్రేమకు చిహ్నంగా ప్రపంచ కళాఖండంగా వెలుగుతున్న తాజ్ మహల్ ఘనత మరో మెట్టు ఎక్కింది. అంతర్జాతీయ ట్రిప్ అడ్వైజర్ సంస్థ తాజాగా రూపొందించిన జాబితా ప్రకారం మన తాజ్ మహల్ ప్రపంచ అద్బుత కట్టడాల్లో ఐదో స్థానంలోనూ

Webdunia
శనివారం, 27 మే 2017 (05:24 IST)
ప్రేమకు చిహ్నంగా ప్రపంచ కళాఖండంగా వెలుగుతున్న తాజ్ మహల్ ఘనత మరో మెట్టు ఎక్కింది. అంతర్జాతీయ ట్రిప్ అడ్వైజర్ సంస్థ తాజాగా రూపొందించిన జాబితా ప్రకారం మన తాజ్ మహల్ ప్రపంచ అద్బుత కట్టడాల్లో ఐదో స్థానంలోనూ, ఆసియా అద్భుత కట్టడాల్లో రెండో స్థానంలో నిలిచింది.  పర్యాటక సేవలందించే ప్రముఖ ‘ట్రిప్‌ అడ్వైజర్‌’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. 
 
ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌ ఐదో స్థానంలో నిలిచింది.  ‘ట్రావెలర్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌ ఫర్‌ ల్యాండ్‌మార్క్స్‌’ పేరిట ట్రిప్‌ అడ్వైజర్‌ ఈ జాబితాను విడుదల చేసింది. కాంబోడియాలోని అంగ్‌ కోర్‌వాట్‌ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది. 
 
ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్‌ డీ కోర్డొబా, వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా నిలిచాయి. తర్వాత స్థానాల్లో రష్యాలోని ‘చర్చ్‌ ఆఫ్‌ ద సేవియర్‌ ఆన్‌ స్పిల్ల్‌డ్‌ బ్లడ్‌ (6), బీజింగ్‌లోని గ్రేట్‌వాల్‌ (7), పెరూలోని మచుపిచు (8) స్పెయిన్‌లోని ప్లాజా డీ ఎస్పనా (9), ఇటలీలోని డ్యుమో డీ మిలానో (10) నిలిచాయి. 
 
ఆసియా కట్టడాలతో విడుదల చేసిన మరో జాబితాలో తాజ్‌మహల్‌ రెండో స్థానంలో నిలిచింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments