Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్.. సెల్ఫీ తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయింది...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (09:18 IST)
సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్‌గా పేరుగాంచి తైవాన్ దేశానికి చెందిన గిగి వూ చివరకు సెల్ఫీ తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, తైవాన్ దేశంలోని న్యూ తైపీ నగరానికి చెందిన గిగి వూ అనే యువతికి ఎత్తైన ప్రదేశాల నుంచి సెల్ఫీలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమంటే మహా సరదా. 
 
అలా... తైవాన్‌లోని యుషాన్ నేషనల్ పార్కు‌లోని ఎత్తైన పర్వతంపై అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తుజారి వంద అడుగుల లోతులో పడిపోయింది. దీంతో ఆమె కదల్లేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. అయితే తాను ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని మాత్రం శాటిలైట్ ఫోన్ ద్వారా తన స్నేహితులకు గిగి వూ చేరవేసింది. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన తైవాన్ రెస్క్యూ బృందాలు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, వాతావరణం సరిగా లేకపోవడంతో హెలికాఫ్టర్లు ఆ ప్రాంతానికి చేరుకోలేక పోయాయి. ఫలితంగా సెల్ఫీ క్వీన్ ప్రాణాలు విడిచింది. వాతావరణం అనుకూలించిన తర్వాత మృతదేహం కోసం గాలిస్తామని రెస్క్యూ బృందాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments