Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న సంధించింది. 'మిస్టర్ ట్రంప్! మీరు ఎప్పుడైనా 24 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నారా?' అని ప్రశ్నించింది. శరణార్థులు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (08:49 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న సంధించింది.  'మిస్టర్ ట్రంప్! మీరు ఎప్పుడైనా 24 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నారా?' అని ప్రశ్నించింది. శరణార్థులు తిండిలేక, ఆశ్రయం లేక, దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, వారిపై కనికరం చూపకుంటే ఎలా? అంటూ నిలదీసింది. ఆశావహ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని హితవు పలికింది. అంతేనా.. నేను టెర్రరిస్టులా కనిపిస్తున్నానా అంటూ ఆమె బాలిక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
సిరియా లోని దుర్భర జీవితం గురించి ఓ వీడియో ద్వారా వెల్లడించింది. సెలబ్రిటీగా మారిన సిరియా చిన్నారి పేరు బనా అల్బెడ్. వయసు ఏడేళ్లు. ట్విట్టర్ వేదికగా డోనాల్డ్ ట్రంప్‌ను ఏకిపడేసింది. 3 నెలలపాటు బాంబుల మోతతో దద్దరిల్లిన అలెప్పో నగరంలో తాను ఏనాడూ ఆశావహదృక్పథాన్ని కోల్పోలేదని చెప్పింది. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. 'పోనీ మీరు చెప్పండి, నేను టెర్రరిస్టునా?' అని నిలదీసింది. ఇదిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రీ ట్వీట్ అవుతోంది. చిన్నారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పలువురు ట్రంప్‌ను ట్విట్టర్ లో ప్రశ్నిస్తుండటం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments