Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్ట్‌ను చిత్రహింసలు పెట్టారు.. అత్యాచారం చేశారు.. హతమార్చారు..

ఇన్వెస్టిగేటివ్ మహిళా జర్నలిస్టును పాశవికంగా హత్యచేశారు దుండగులు. తొలుత ఆమెను చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. ఈ దుర్ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది.

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (15:39 IST)
ఇన్వెస్టిగేటివ్ మహిళా జర్నలిస్టును పాశవికంగా హత్యచేశారు దుండగులు. తొలుత ఆమెను చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. ఈ దుర్ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల విక్టోరియా మారినోవా ఆ దేశంలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానెల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో జరిగిన అవకతవకలపై మారనోవా వరుస కథనాలు రాస్తోంది. ఈ కథనాలు యూరప్‌లో పెను సంచలనంగా మారాయి. 
 
డిటెక్టర్ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కానీ రూస్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మారనోవాకు అదే చివరి రోజుగా మారిపోయింది. మారనోవాను అడ్డుకున్న దుండగులు ఆమెను పాశవికంగా హత్య చేశారు. చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హతమార్చారు. 
 
ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్‌కు సమీపంలో పడేశారు. అయితే జర్నలిస్ట్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఆమె మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషేంట్లు ఎవరైనా ఆమెపై దాడి చేసి చంపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం మారినోవా తలకు భారీ గాయాలయ్యాయని... ఊపిరాడక ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. గతేడాది కాలంలో యూరప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి ఈ నేపథ్యంలో మారనోవా హత్యకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పోలీసులు మారనోవా హత్య నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments