Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 విశ్వవిజేతగా నిలిచేది మాత్రం "మెన్ ఇన్ బ్లూ'': సుందర్ పిచాయ్

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:56 IST)
2019 ప్రపంచ కప్‌‌ను ఏ జట్టు గెలుచుకుంటుందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌తో ఇంగ్లండ్ తలపడుతుందని చెప్పారు. చివరకు విశ్వవిజేతగా నిలిచేది మాత్రం మెన్ ఇన్ బ్లూ (భారత్) అని సుందర్ పిచాయ్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా బలమైన జట్లు అని చెప్పారు. 
 
తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వచ్చిన కొత్తల్లో తాను తొలిసారి బేస్ బాల్ మ్యాచ్ ఆడానని.. తాను కొట్టిన బంతి వెనక వైపుగా వెళ్లిందని, క్రికెట్లో అయితే అది చాలా మంచి షాట్ అని చమత్కరించారు. 
 
క్రికెట్లో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బ్యాట్ చేతిలో పట్టుకొని పరుగెడతామని, బేస్ బాల్ లో కూడా అదే విధంగా బ్యాట్ పట్టుకుని పరుగెత్తానని చెప్పారు. ఇక బేస్ బాల్ కొంచెం కష్టమనిపించిందని.. కానీ, ఇప్పటికీ తనకు క్రికెటే ఇష్టమని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతానని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments