Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి.. అడ్వైజరీ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ!!

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (13:07 IST)
ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్ - మధ్య పశ్చిమ లోని లెబనీస్ మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య నానాటికీ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఓ అడ్వైజరీని జారీ చేసింది. "అప్రమత్తంగా ఉండండి.. భద్రతా నిబంధనలు పాటించండి" అంటూ ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఓ సూచన చేసింది. హమాస్, హిజ్బుల్లా అగ్రనేతల మృతితో ఆందోళనకర పరిస్థితులు ఉండంతో ఎక్స్ వేదికగా ఈ మేరకు ట్వీట్ చేసింది. 
 
ఇజ్రాయెల్లో‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడి భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. "దయచేసి జాగ్రత్తగా ఉండండి. దేశంలో (ఇజ్రాయెల్) అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రాంతాల వద్ద ఉండండి. భారత ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయుల భద్రత కోసం ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని పేర్కొంది.
 
అత్యవసర పరిస్థితుల్లో 24x7 హెల్ప్ లైన్ నెంబర్లు, ఎంబసీ ఈ-మెయిల్ ఐడి ద్వారా సంప్రదించాలని సూచించింది. అత్యవసరమైతే 24x7 హెల్ప్ లైన్ నెంబర్లు +972-547520711, +972- 543278392 ద్వారా సంప్రదించవచ్చునని సూచించింది. const.telaviv@mea.gov.in ద్వారా ఎంబసీతో టచ్ ఉండవచ్చునని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments