Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ క్లింటన్ ఓ క్రిమినల్... ఆమెకు నేనెందుకు ఓటు వేస్తా : డెమొక్రాటిక్ ఎలక్టర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ ఎన్నికల గళం రణరంగంలా మారింది. పుయలుప్ తెగకు చెందిన నేత రాబర్ట్ సాషియాకమ్ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన డెమొక్రాటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ మద్దతుదారు.

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (15:35 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ ఎన్నికల గళం రణరంగంలా మారింది. పుయలుప్ తెగకు చెందిన నేత రాబర్ట్ సాషియాకమ్ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన డెమొక్రాటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ మద్దతుదారు. వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందిన రాబర్ట్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేసేది లేదని తెగేసి చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినప్పటికీ ఎలక్టొరల్ కాలేజీ ఓటును తాను ఆమెకు మద్దతుగా వేసేది లేదని తేల్చి చెప్పాడు. క్లింటన్ ఓ క్రిమినల్ అని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అమెరికన్ ఇండియన్ల గురించి ఆమె సరిగ్గా పట్టించుకోరని ఆరోపించారు. 
 
ఆమె చేసిందేమీ లేదని, తిమ్మిని, బమ్మి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఏం చేయాలనే విషయంపై చాలా తర్జనభర్జన పడుతున్నట్టు చెప్పారు. క్లింటన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికాకు నాయకత్వం వహించలేరన్నారు. ‘‘నా భూమి గురించి కానీ, నా గాలి గురించి కానీ, నా నిప్పు గురించి కానీ, నా నీరు గురించి కానీ ఆమె పట్టించుకోరు’’ ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments