Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలిస్తున్న చర్చలు... సరిహద్దుల నుంచి బలగాలు వెనక్కి

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:40 IST)
భారత్, చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలితాన్నిస్తున్నాయి. దీంతో సరిహద్దుల నుంచి ఇరు దేశాలకు చెందిన సైనికులు అనుకున్న సమయం కంటే ముదుగానే వెనుదిరుగుతున్నాయి. 
 
ఇటీవలి కాలంలో చైనా, భారత్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ ఉద్రిక్తతలు యుద్ధవాతావరణం కల్పించాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మొహరించాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటి ఫలితంగా సరిహద్దుల వెంబడి ఉన్న సైనికబలగాలను వెనక్కు తరలించాలని నిర్ణయించాయి. 
 
ఈ ప్రక్రియ అనుకున్న సమయంకన్నా, ముందుగా, వేగంగా సాగుతోందని సమాచారం. సరిహద్దుల నుంచి సైనికులు వెనక్కు మళ్లుతున్న అంశాన్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి సైన్యం తొలగింపు ప్రక్రియ సాగుతోందని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్యా ఈ దిశగా లిఖితపూర్వక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
 
"సైన్యాన్ని వెనక్కు తీసుకునే ప్రక్రియ రెండు వైపులా సాగుతోంది. ఇది అనుకున్న సమయం కన్నా ముందుగానే జరుగుతోంది. ఈ నెల 20 నాటికి తొలి దశ తరలింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం" అని సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో చైనా సైనికాధికారులతో జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిన వేళ, మలి విడత చర్చల్లో లిఖిత పూర్వక డీల్ కుదరాల్సిందేనని ఇండియా పట్టుబడింది.
 
సరిహద్దుల్లో మోహరించిన హెలికాప్టర్లు, నిఘా డ్రోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, సైన్యాన్ని సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లిపోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఒప్పందం కుదిరిన 48 గంటల్లోగా సైనికుల తరలింపు ప్రారంభం కావాలని డీల్ కుదరగా, పెట్రోలింగ్ పాయింట్స్ 15, 17, హాట్ స్ప్రింగ్స్ తో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన గోగ్రా ప్రాంతం నుంచి కూడా సైనికుల తరలింపు ప్రారంభమైందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments