Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్లాడను పో... చైనా.. మాట్లాడాలని అడిగామా.. భారత్ కౌంటర్‌తో దిమ్మతిరిగిన చైనా

జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 సమావేశాలు శుక్రవారం నుంచి జరుగనున్న నేపథ్యంలో తమ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీతో మాట్లాడేది లేదు పొమ్మని బెట్టు చేసిన చైనా తర్వాత భారత్ ఇచ్చిన కౌంటర్‌కు బిత్తరపోయింది. భారత్-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ వద్ద సిక్

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (02:27 IST)
జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 సమావేశాలు శుక్రవారం నుంచి జరుగనున్న నేపథ్యంలో తమ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీతో మాట్లాడేది లేదు పొమ్మని బెట్టు చేసిన చైనా తర్వాత భారత్ ఇచ్చిన కౌంటర్‌కు బిత్తరపోయింది. భారత్-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ వద్ద సిక్కిం సెక్టర్‌లోని డోకలామ్ ప్రాంతంలో రోడ్డును నిర్మించేందుకు చైనా సైన్యానికి చెందిన ఓ బృందం ప్రయత్నించడంతో  దాదాపు 20 రోజుల నుంచి భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు వాతావరణం సరిగా లేదంటూ దర్పం ఒలకబోసిన చైనాకు భారత విదేశాంగ శాఖ అధికారి తిరుగులేని సమాధానం ఇచ్చారు.
 
జీ-20 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చర్చలు జరపబోరని చెప్పిన చైనాకు భారతదేశం ఘాటైన సమాధానం ఇచ్చింది. అసలు తాము జీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు అవకాశమివ్వాలని అడగలేదు కదా! అని నిలదీసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బృందంలో సభ్యుడైన ఓ అధికారి ఈ కౌంటర్ ఇచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. 
 
‘‘మేం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అడగలేదు, అలాంటపుడు వాతావరణం సానుకూలంగా ఉండటం, లేకపోవడం అనే ప్రశ్నకు తావేదీ?’’ అని ఆ అధికారి ప్రశ్నించారని పేర్కొంది. నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఏదీ లేదన్నారని, డోకలామ్ ప్రతిష్టంభన పరిష్కారానికి ఇరు దేశాలు తమ సైన్యాలకే అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నారని తెలిపింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments