Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసు : జాత్యంహకారి ఉరిశిక్షే సరి

అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన జాత్యంహకారి ఆడమ్ ప్యూరింటన్‌కు ఉరి శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. ఆయనపై మోపిన హేట్ క్రైమ్, మర్డర్

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (16:19 IST)
అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన జాత్యంహకారి ఆడమ్ ప్యూరింటన్‌కు ఉరి శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. ఆయనపై మోపిన హేట్ క్రైమ్, మర్డర్ అభియోగాలు రుజువు కావడంతో ఈ శిక్షను కోర్టు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, గత ఫిబ్రవరి 22న బార్‌లో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య అమెరికాలో కలకలం సృష్టించింది. జాతి పేరుతో దూషిస్తూ ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి బార్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించగా ఆయన స్నేహితుడు అలోక్‌కు గాయాలు అయ్యాయి. జాత్యంహకారి దూషణలను అడ్డుకున్న మరో అమెరికన్‌పై కూడా ప్యూరింటన్ కాల్పులు జరిపాడు.
 
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జాత్యంహకార దాడులకు ఇది పరాకాష్ట. కూచిబొట్ల హత్య జాత్యంహకార దాడేనని స్వయంగా అమెరికా చట్టసభలే అంగీకరించాయి. స్వయాన ట్రంపే ఈ దాడిని ఖండించారు. కూచిభొట్ల భార్య సునయను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆశయాలను తాను నెరవేరుస్తానని ఆమె చెప్పారు. కూచిబొట్ల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments