Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో పెట్రోల్ కోసం ఎండలో నిలబడి 10 మంది మత్యువాత

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:30 IST)
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాటు ఇంధన సంక్షోభం కూడా తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర విషాద సంఘటనలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఇంధనం కోసం బంకుల ముందు రోజుల తరబడి క్యూలోనే వేచిచూడాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 
 
అలా నిరీక్షిస్తూ క్యూలోనే తనువు చాలిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఐదురోజుల పాటు క్యూలో ఉండి చివరకు ప్రాణాలు విడిచినట్టు శ్రీలంక మీడియా పేర్కొంది. ఇలా ఇంధనం కోసం వేచిచూస్తూ మరణించిన వారిసంఖ్య పదికి చేరడం శ్రీలంక సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
 
వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63 ఏళ్ల వృద్ధుడు అంగురువటోటలోని పెట్రోల్‌ బంకు వద్ద వేచిచూస్తున్నాడు. అలా ఐదురోజులు అయినప్పటికీ ఇంధనాన్ని నింపుకోలేకపోయాడు. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. 
 
ఇలా ఇంధనం కోసం క్యూలో వేచిచూస్తూ మరణించడం ఇదో పదో సంఘటన అని పేర్కొన్నారు. చనిపోయిన వాళ్లందరూ 43 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న వారే. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు శ్రీలంక మీడియా వెల్లడించింది. రాజధాని కొలంబోలోని పానాదుర ప్రాంతంలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద క్యూలో నిలబడిన ఓ 53ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనికితోడు ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక.. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు, పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments